Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్‌తో ప్రేమాయణంపై స్పందించిన శిల్పాశెట్టి

  • 1990లలో సల్మాన్, శిల్పాలు డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం
  • ఆ వార్తలపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన శిల్పాశెట్టి
  • నాన్న కోసమే సల్మాన్ ఇంటికొచ్చేవాడన్న ముద్దుగుమ్మ 
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి వ్యాపావేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని, లైఫ్ లో సెటిలైపోయింది. అయితే 1990లలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో శిల్పా డేటింగ్ చేస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వేళాపాళా లేకుండా అర్ధరాత్రుల్లో కూడా శిల్పాశెట్టి ఇంటకి సల్మాన్ వెళుతుండటంతో... ఏదో జరుగుతోందనే ప్రచారం జరిగింది. అప్పట్లో వీరి డేటింగ్ వార్త ఓ హాట్ టాపిక్. అయితే, దీనిపై వారిద్దరిలో ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో, క్లారిటీ లేని అంశంగానే అది మిగిలిపోయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై శిల్ప స్పందించింది. సల్మాన్ కు, తన తండ్రికి ఎంతో మంచి అనుబంధం ఉందని ఆమె తెలిపింది. ఇద్దరూ కలసి మందు తాగేంత చనువు వారి మధ్య ఉందని చెప్పింది. ఈ కారణం వల్లనే సల్మాన్ తరచుగా తమ ఇంటికి వచ్చి పోయేవాడని తెలిపింది. నాన్న చనిపోయిన తర్వాత తమ ఇంటికి సల్మాన్ ఎప్పుడు వచ్చినా నేరుగా బార్ వద్దకు వెళ్లేవాడని, టేబుల్ పై తల పెట్టి ఏడ్చేవాడని చెప్పింది. అందరూ ఊహించుకున్నట్టు సల్మాన్ కు, తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. 
shilpa shetty
Salman Khan
dating
bollywood

More Telugu News