పెళ్లయిన నెల రోజుల్లోనే... పదేళ్ల చిన్నవాడైన టెన్త్ విద్యార్థితో పరారైన టీచర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లయిన నెల రోజుల్లోనే... పదేళ్ల చిన్నవాడైన టెన్త్ విద్యార్థితో పరారైన టీచర్!

  • గత నెల 19న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం
  • ప్రైవేటు స్కూల్ లో పనిచేస్తున్న యువతి
  • విద్యార్థితో కలసి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం
అమె వయసు 26 సంవత్సరాలు. ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిపించగా, పెళ్లయిన నెల రోజులకే, తాను విద్యను బోధించే పదో తరగతి విద్యార్థితో కలసి ఆమె పరారైంది. ఆపై పోలీసులను ఆశ్రయించి, తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, తమిళనాడు సేలం, తిరువాగౌండనూరుకు చెందిన ఓ మహిళకు గత నెల 19న పెళ్లయింది. భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తుండటంతో, వివాహమైన వారం తరువాత అతను వెళ్లిపోగా, ఆమె పుట్టింటికి వచ్చింది. సోమవారం నాడు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ దాకా వెళ్లి వస్తానని చెప్పిన ఆమె, తిరిగి రాకపోవడంతో, పలు చోట్ల గాలించి, ఆపై మంగళవారం నాడు పోలీసులును ఆశ్రయించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో బాలుడితో సహా స్టేషన్ కు వచ్చిన ఆమె, విద్యార్థితోనే ఉంటానని చెప్పడంతో, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Tamilnadu
Teacher
10 th Student
Police
Selam

More Telugu News