ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య... తలాక్ చెప్పేసిన భర్త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య... తలాక్ చెప్పేసిన భర్త

  • ఫోన్‌లోనే తలాక్‌ చెప్పేసి వదిలించుకునేందుకు ప్రయత్నం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
  • మూడు వారాల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి
బిడ్డ పుట్టిందని ఆ తల్లి మురిసిపోయింది. ఆ ఆనంద క్షణాలను భర్తతో పంచుకోవాలని ఆశపడింది. కానీ అతగాడి తీరు వేరుగా ఉంది. తన అభిమతానికి వ్యతిరేకంగా భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చిందన్న కోపంతో ఫోన్‌లోనే మూడుసార్లు తలాక్‌ చెప్పేసి నీకూ...నాకూ ఏ సంబంధం లేదు, పొమ్మన్నాడు. హైదరాబాద్‌ మహానగరం టోలీచౌకీలో జరిగిన ఈ ఘటన మూడు వారాల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. టోలీచౌకీలో నివాసం ఉంటున్న ముజమ్మిల్‌ ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్‌. గత ఏడాది జనవరిలో ఆ ప్రాంతంలోనే ఉంటున్న యువతిని పెళ్లాడాడు. మూడు నెలల క్రితం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తన అభీష్టానికి వ్యతిరేకంగా భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కోపంతో ప్రసవ సమయం నుంచి ముజమ్మిల్‌ భార్యను ఏదో రూపంలో వేధిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నవంబరు 28న భార్యకు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ ఎత్తగానే ‘తలాక్‌’ అంటూ మూడుసార్లు చెప్పేసి ఫోన్‌ పెట్టేశాడు. దీంతో హతాశురాలైన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై సీసీఎస్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Hyderabad
tolichouk

More Telugu News