దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య ట్వీట్‌తో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రంగంలోకి పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య ట్వీట్‌తో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రంగంలోకి పోలీసులు

  • ల్యాండ్ మాఫియా నుంచి దిలీప్ కుమార్‌ భార్యకు బెదిరింపులు
  • ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వేడుకోలు
  • సీఎంవో జోక్యంతో రంగంలోకి పోలీసులు
ల్యాండ్ మాఫియా నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరాబాను మూడు రోజుల క్రితం ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ బంగ్లాలోని రెండు ప్లాట్లను కొట్టేయడానికి సమీర్ భోజ్వానీ ప్లాన్ చేస్తున్నాడని, ఈ క్రమంలో బెదిరింపులకు దిగుతున్నాడని అందులో ఆరోపించారు. గతంలో సైరాబాను ఫిర్యాదుపై అరెస్ట్ అయిన ల్యాండ్ మాఫియా, బిల్డర్ సమీర్ భోజ్వానీ ఇటీవల విడుదలయ్యాడు.

సమీర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమను బెదిరిస్తున్నాడని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ సైరాబాను ట్వీట్ చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేస్తామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సైరాబాను ట్వీట్‌తో తాజాగా ఫడ్నవిస్ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో పోలీసులు మరోమారు రంగంలోకి దిగారు. సమీర్ భోజ్వానీ బెయిలును రద్దు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
Maharashtra
Saira Banu
Narendra Modi
Dilip Kumar
Samir Bhojwani

More Telugu News