వావ్.. ఏమి రుచి!.. ఆంధ్రా భోజనానికి డచ్ హైకమిషనర్ ఫిదా!
- లొట్టలేసుకుంటూ తిన్న డచ్ హై కమిషనర్
- గుంటూరు జిల్లాలోని ఓ హోటల్ లో ఘటన
- భలే రుచిగా ఉందంటూ ప్రశంస
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి వెళ్లిన ఆయన ఓ హోటల్ లో ఫుడ్ ఆరగించారు. అనంతరం భలే రుచిగా ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ భోజనానికి తాను ఫిదా అయ్యానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ టేస్ట్ చూశాక.. ఆంధ్రా ఖ్యాతి ఏంటో అర్థమైందన్నారు.