BJP: దేశంలో మూడో కూటమి అంటే దొడ్డిదారిన బీజేపీకి మేలు చేకూర్చడమే!: చంద్రబాబు

ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తోందని, ఈ పరిస్థితుల్లో మూడో కూటమి అంటే దొడ్డిదారిని ఆ పార్టీకి మేలు చేకూర్చడమేనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌ సభలో సోనియాగాంధీ ప్రకటించగానే కేసీఆర్‌ సెంటిమెంట్‌ను రగిలించారని, అటువంటి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి మజ్జిస్‌ అధ్యక్షుడు అసుదుద్దీన్‌ ఒవైసీ వంతపాడుతున్నారని, అసలు ఒవైసీకి, జగన్‌కు మధ్య దోస్త్‌ ఎప్పుడు కుదిరిందని ప్రశ్నించారు. వీరిని కూడా మోదీయే కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
BJP
Narendra Modi
Chandrababu

More Telugu News