కర్ణాటక సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు ఉందంటూ ఫోన్.. పోలీసుల పరుగులు!

  • కాసేపట్లో బాంబు పేలుతుందని ఫోన్
  • తనిఖీల అనంతరం ఏమీ లేదని తేల్చిన పోలీసులు
  • ఫేక్ కాల్ చేసిన మన్సూర్ అనే యువకుని అరెస్ట్
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టారని, అది కాసేపట్లో పేలనుందని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కు ఓ కాల్ రాగా, అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఫోన్ కాల్ తరువాత అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లిన పోలీసులు, తనిఖీల అనంతరం అదో ఫేక్ కాల్ అని తేల్చారు. ఆపై ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన జేపీ నగర్ పోలీసులు, మన్సూర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అతను తన పేరును గోపాల్ గా మార్చి చెప్పాడని గుర్తించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Bomb
Fake Call
Kumaraswami
Police

More Telugu News