Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ మూవీ తరువాత ఎన్టీఆర్ తోనే కొరటాల!

  • చిరూతో కొరటాల నెక్స్ట్ మూవీ 
  • ఆ తరువాత ప్రాజెక్టుకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ 
  • చిన్న సినిమాలు నిర్మించే ఆలోచనలో కొరటాల
చిరంజీవి 152వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఆయన అందుకు సంబంధించిన పనుల్లోనే వున్నారు. చిరంజీవి నుంచి ఆయన అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక మునుపే కొరటాల ఆ తరువాత ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టేశారు.

చిరంజీవి సినిమాను పూర్తి చేసిన తరువాత ఆయన ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్'వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడం వలన, కొరటాలపై గల నమ్మకంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. కొరటాల .. సుధాకర్ ఇద్దరూ కలిసి భవిష్యత్తులో చిన్న సినిమాలు నిర్మించాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. మొత్తానికి సుకుమార్ బాటలోనే కొరటాల అడుగులు వేయనున్నారన్న మాట. 
koratala
chiru
ntr

More Telugu News