Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదరగొట్టేస్తోన్న 'మణికర్ణిక' ట్రైలర్

  • వీరనారిగా కంగనా రనౌత్ 
  • పాత్రలో ఒదిగిపోయిన కంగనా 
  • జనవరి 25వ తేదీన విడుదల      
కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా 'మణికర్ణిక' చిత్రం రూపొందింది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం .. గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం .. వివాహం .. ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం .. భర్తను కోల్పోవడం .. వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కంగనా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
kangana

More Telugu News