నేనేంటో తెలియదా?... మహిళా అధికారిని బెదిరిస్తూ వీడియోకు చిక్కిన యూపీ బీజేపీ నేత!
- యూపీలో ఎమ్మెల్యే అధికార దర్పం
- ఎస్డీఎంతో ఉదయభన్ వాగ్వాదం
- నా దర్పం తెలియదా? అంటూ ఆగ్రహం
తానో రాజకీయ నేతనని, తన సత్తా ఏంటో చూపిస్తానని ఎమ్మెల్యే అంటుండటం ఈ వీడియోలో వినిపిస్తోంది. "నా అధికారం ఏంటో నీకు తెలియదా" అని చౌదరి కేకలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆపై గరీమా సింగ్ ను ఓ పనిమనిషిగా సంబోధిస్తూ, దర్పం తన వద్ద ప్రదర్శించాలని అనుకుంటే కుదరదని, నీవు ఓ నౌకరువు మాత్రమేనని అనడం వినిపిస్తోంది. ఇదే సమయంలో అక్కడున్న కొందరు ఆయన్ను వ్యతిరేకిస్తూ 'ఎస్డీఎం జిందాబాద్' అనడం కూడా వీడియోలో రికార్డయింది.