చంద్రబాబు వచ్చాడని తెలిసి. వెళ్లిపోయిన తుపాను కూడా వెనక్కు వచ్చింది!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- అంతటి శనిపుత్రుడు చంద్రబాబు
- చంద్రబాబు ఓటమిని ముందుగానే అంగీకరించారు
- అందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు కోరుతున్నారు
ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఓటమిని ముందే అంగీకరించారని తెలిపారు. అందుకే ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు మోదీ సహకరించడన్న అనుమానంతోనే చంద్రబాబు ఈ కొత్త డిమాండ్ కు తెరలేపారని ఆరోపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.