పుట్టినరోజు వేళ పార్లమెంటులో టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు నిరాహార దీక్ష !
- ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరశన
- మద్దతు తెలిపిన టీడీపీ నేతలు
- వంగపండు వేషధారణలో శివప్రసాద్ నిరసన
అంతకుముందు ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ రావు వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన టీడీపీ నేత ఎన్.శివప్రసాద్ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. తొలుత ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ, ఆ తర్వాత మాత్రం ప్యాకేజీ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. చివరికి ప్యాకేజీని సైతం గాలికి వదిలేసి లీకేజీగా మార్చారని ఎద్దేవా చేశారు. 2019లో మోదీకి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.