'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం చూడొచ్చు: వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం చూడొచ్చు: వర్మ

  • అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద స్టార్ 
  • లక్ష్మీపార్వతి ఓ సాధారణ మహిళ
  • నాలో తలెత్తిన పెద్ద ప్రశ్న ఇదే  
ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందిస్తూ ఉండగా, మరో వైపున ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

"అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద స్టార్ .. ఆయన ఎంతో పాప్యులర్. లక్ష్మీపార్వతి విషయానికి వస్తే ఆమె ఓ సాధారణ మహిళ .. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్ కి ఎలా చేరువైంది? అనేదే నాకు పెద్ద ప్రశ్నగా తోచింది. ఆ ప్రశ్న నుంచే నా పరిశోధన మొదలైంది .. ఆ పరిశోధనలో నుంచే ఈ సినిమా రానుంది.

క్రిష్ రూపొందిస్తోన్న 'కథానాయకుడు'లో ఎన్టీఆర్ సినీ జీవితం .. 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఉంటాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో చూడొచ్చు" అని ఆయన చెప్పుకొచ్చారు. 
ramgopal varma

More Telugu News