ప్రజల డేటాను చంద్రబాబు వాడుకోబోతున్నారు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి!: విజయసాయి రెడ్డి
- చంద్రబాబు వద్ద 3.72 కోట్ల మంది డేటా
- ఆర్థికంగా ప్రలోభపెట్టేందుకు యత్నాలు
- ఓట్లతో డేటాను లింక్ చేస్తున్నారని వెల్లడి
ఈ డేటాను రియల్ టైమ్ ఓటర్ డేటాతో ప్రభుత్వం లింక్ చేసిందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించడానికి ఓటర్లను ఆర్థికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.