కోడలి అశ్లీల ఫొటోలను వైరల్ చేసిన అత్తమామలు!

  • భర్త మరణంతో ఒంటరైన యువతి
  • బ్యాంకు ఖాతా వివరాలు అడగడంతో అత్తమామల వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
భర్త మరణించి ఒంటరిగా మిగిలిన కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్తమామలే ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి తరిమేయాలని మార్ఫింగ్ చేసిన ఆమె అశ్లీల దృశ్యాలను ఫేస్ బుక్ లో పెట్టి వైరల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరుగగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, చెప్పుల దుకాణం నిర్వహించే ఓ వ్యక్తి కొంతకాలం క్రితం మరణించాడు. ఆయనకు భార్య (25), రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇక భర్త బ్యాంకు ఖాతా వివరాలను తనకు ఇవ్వాలని కోడలు అడిగిన నాటి నుంచి అత్తమామలు ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. కోడలి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా మార్చి ఫేస్ బుక్ లో పెట్టారు. ఈ విషయం తెలుసుకుని ప్రశ్నించిన కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Widow
Morfing
Uttar Pradesh
Police
Facebook

More Telugu News