Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీతో చెప్పులు తొడిగించుకున్నందుకు.. సాక్షిపై విరుచుకుపడుతున్న అభిమానులు

  • ధోనీతోనే చెప్పులు తొడిగించుకుంటావా?
  • అంత మంచి మనిషితో ఇంత దారుణంగా వ్యవహరిస్తావా?
  • ధోనీ నీవు కెప్టెన్ వి.. సర్వెంట్ వి కాదు
తన భార్య సాక్షికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పులు తొడిగిన ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోను సాక్షి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు, చెప్పులు నీవే ఇప్పించావు, వాటిని నువ్వే తొడగాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీనిపై ధోనీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ధోనీతోనే చెప్పులు తొడిగించుకుంటావా? అంటూ విరుచుకుపడుతున్నారు. అంత మంచి మనిషితో ఇంత దారుణంగా వ్యవహరిస్తావా? అంటూ మరి కొందరు మండిపడ్డారు. ధోనీ నీవు కెప్టెన్ వి.. సర్వెంట్ వి కాదు అంటూ మరి కొందరు స్పందించారు.
dhoni
sakshi
chappals

More Telugu News