సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారుల బోటు
- కాకినాడ నుంచి విశాఖకు వస్తుండగా సముద్రంలో చిక్కుకుపోయిన బోటు
- బోటులో ఆరుగురు మత్స్యకారులు
- మత్స్యకారులను రక్షించేందుకు రంగంలోకి దిగిన అధికారులు
ఈ బోటులో ఎస్.రాయవరం మండలం పోలవరంకు చెందిన ఆరుగురు మత్స్యకారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వారికోసం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.