Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంతారావు బయోపిక్ గా 'రాకుమారుడు' .. రెగ్యులర్ షూటింగుకి రంగం సిద్ధం

  • జానపద చిత్రాల రారాజుగా కాంతారావు 
  • 'రాకుమారుడు' టైటిల్ తో బయోపిక్ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ 
తెలుగు తెరపై పౌరాణికాల ద్వారా ఎన్టీఆర్ .. సాంఘికాల ద్వారా ఏఎన్నార్ తమదైన ముద్రవేస్తే, జానపదాలపై కాంతారావు తనదైన ముద్ర వేశారు. జానపదాల్లో సహజంగానే కత్తి యుద్ధాలు ఉంటాయి .. ఆ కత్తి యుద్ధాల్లో ఆరితేరిన కథానాయకుడిగా మార్కులు కొట్టేసిన కాంతారావును, అభిమానులు 'కత్తి కాంతారావు' అనే పిలుచుకునేవారు.

అలాంటి కాంతారావు జీవితచరిత్రను దర్శకుడు పీసీ ఆదిత్య సినిమాగా రూపొందిస్తున్నాడు. కాంతారావు జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 'రాకుమారుడు' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఆయన, పాటల రికార్డింగ్ ను పూర్తి చేశాడు. త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాంతారావు పాత్రకు గాను అఖిల్ సన్నీ అనే యువకుడిని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. రాజనాల .. దర్శకుడు విఠలాచార్య .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. పాత్రలకి గాను నటీనటుల ఎంపిక జరగవలసి వుంది. 
kantarao

More Telugu News