నలుగురు అమ్మాయిలను సరఫరా చేసిన గాయని దీపాశెట్టి... రేవ్ పార్టీ భగ్నం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నలుగురు అమ్మాయిలను సరఫరా చేసిన గాయని దీపాశెట్టి... రేవ్ పార్టీ భగ్నం!

  • హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ
  • ఒక్కో అమ్మాయికి 15వేలతో ఒప్పందం
  • అరెస్ట్ చేసిన పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ శివార్లలోని మామిడితోటలో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హమీద్ ఖాన్ అనే వ్యక్తి, తన ఫామ్ హౌస్ లో బర్త్ డే వేడుకలకు ప్లాన్ చేసి, రేవ్ పార్టీ పెట్టి మిత్రులను ఆహ్వానించాడు. ఈ పార్టీకి కావాల్సిన అమ్మాయిలను సరఫరా చేసేందుకు నర్తకి, గాయని దీపాశెట్టిని సంప్రదించారు. పార్టీలో బెల్లీ డ్యాన్స్ ఆపై వ్యభిచారం చేసేందుకు నలుగురు డ్యాన్సర్లు కావాలని చెబుతూ ఒక్కొక్కరికి రూ. 15 వేలు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.

ఆపై ఆదివారం రాత్రి దీపాశెట్టి, నలుగురు అమ్మాయిలతో కలసి హమీద్ ఏర్పాటు చేసిన ఇన్నోవా (టీఎస్ 12 జీ 5890)లో మామిడితోట వద్దకు చేరుకుంది. ఒంటిగంట సమయంలో వారంతా పార్టీ చేసుకుంటుండగా, వారి మ్యూజిక్ పెట్రోలింగ్ చేస్తున్న పహాడీషరీఫ్‌ పోలీసులకు వినిపించింది. పరిశీలించి చూడగా, అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీ వారి కంటపడింది.

ఆపై దాడి చేసి, అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న దీపాశెట్టితోపాటు నలుగురు యువతులను, హమీద్‌ఖాన్‌, అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను తుక్కుగూడలోని ప్రజావాలా హోమ్‌ కు, నిందితులను రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
Rave Party
Hyderabad
Police
/singer Deepasetty

More Telugu News