జార్ఖండ్ 'ముద్దుల పండగ'కు బీజేపీ మోకాలడ్డు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జార్ఖండ్ 'ముద్దుల పండగ'కు బీజేపీ మోకాలడ్డు!

  • ప్రతి సంవత్సరం జార్ఖండ్ లో పండగ
  • గిరిజనులు ఆచారంగా భావిస్తూ కిస్ ఫెస్టివల్
  • అనుమతి నిరాకరించిన బీజేపీ
ముద్దుల పండగ... జార్ఖండ్ లో ప్రతి డిసెంబర్ లో గిరిజనులు నిర్వహించుకునే పండగ. ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తపరచడం తమ ఆచారమని చెబుతూ, సహచరులతో కలసి, పాకూర్‌ జిల్లాలోని సీద్దో కన్హు గ్రామస్తులు ఓ ఆచారంగా దీన్ని నిర్వహిస్తుంటారు. జార్ఖండ్‌ ముక్తీ మోర్చాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత సంవత్సరం జరుగగా, 18 జంటలు పోటీ పడ్డాయి.

ఆ వీడియోలు వైరల్ గా మారగా, అప్పటివరకూ వెలుగులోకి రాని ఈ వింత ఆచారం ప్రపంచానికి తెలిసి, పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సంవత్సరం పండగ జరుపుకునేందుకు అనుమతించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. బహిరంగ ముద్దులు భారత సంప్రదాయం కాదని, అది చెడు సందేశాలు ఇస్తోందన్నది బీజేపీ వాదన.

దీంతో ఈ సంవత్సరం పండగ వద్దని జిల్లా ఎస్‌డీఓ జితేంద్ర కుమార్‌ అదేశాలు జారీచేయగా, గిరిజనులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల పోటీ తమ ఆచారంలో భాగమని, స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమేనని ఎమ్మెల్యే అంటున్నారు.
Jarkhand
Kiss Festival
BJP

More Telugu News