దొంగతనాల బాట పట్టిన రాష్ట్రస్థాయి బాక్సర్
- కుటుంబం కోసం అప్పులు
- వాటిని తీర్చేందుకు చోరీలు
- బాక్సర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇన్ని చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండడంతో అప్పులు చేసేవాడు. వాటిని తీర్చేందుకు చోరీల బాట పట్టాడు. ఇందుకోసం ముందుగా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకునేవాడు. అనంతరం బైక్ నంబరు ప్లేటు మార్చి రంగంలోకి దిగేవాడు. ఇలా ఏడు నెలల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. శుక్రవారం అనుమానాస్పదంగా కనిపించిన నర్సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అతడి నుంచి పదహారున్నర తులాల బంగారు గొలుసులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.