మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం.. మంత్రుల అభిప్రాయం కోరిన సీఎం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం.. మంత్రుల అభిప్రాయం కోరిన సీఎం!

  • ప్రమాణ స్వీకారానికి రావాలంటూ రాహుల్ ఆహ్వానం
  • టెలికాన్ఫరెన్స్‌లో ఆహ్వానంపై చర్చ
  • రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరు
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నుంచి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఆహ్వానం అందింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వారు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ చంద్రబాబును రాహుల్ గాంధీ ఆహ్వానించారు.

రాహుల్ ఆహ్వానంపై సీఎం చంద్రబాబు మంత్రుల అభిప్రాయాన్ని కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఆనందబాబు, కాల్వ శ్రీనివాస్ తదితరులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా? వద్దా? అన్న దానిపై అభిప్రాయం కోరారు. వారు వెళ్లడమే మంచిదని చెప్పడంతో ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరగనున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
Chandrababu
Madhya Pradesh
Rajasthan
Chhattisgarh
Rahul Gandhi

More Telugu News