'బంగార్రాజు' కథ ఒక కొలిక్కి వచ్చేసింది .. నాగ్ సరసన రమ్యకృష్ణ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బంగార్రాజు' కథ ఒక కొలిక్కి వచ్చేసింది .. నాగ్ సరసన రమ్యకృష్ణ ఖరారు

  • నాగ్ కి పేరు తెచ్చిన 'బంగార్రాజు' పాత్ర 
  • ఆ పాత్ర పేరుతోనే సినిమా
  • నాగ్ తో పాటు కనిపించనున్న చైతూ
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'సోగ్గాడే చిన్నినాయనా' ఒకటిగా కనిపిస్తుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచే కథను సిద్ధం చేయమని అప్పట్లోనే కల్యాణ్ కృష్ణకి నాగార్జున చెప్పారు. ఆ తరువాత కల్యాణ్ కృష్ణ కథ చెప్పడం .. నాగ్ మార్పులు చెప్పడం జరుగుతూ వచ్చింది. అలా ఇద్దరూ కలిసి కథను ఒక కొలిక్కి తెచ్చేశారట. ఇప్పుడు పెర్ఫెక్ట్ గా కథ రెడీ అయింది. అందరూ అనుకున్నట్టుగానే నాగార్జున సరసన కథానాయికగా రమ్యకృష్ణను ఖరారు చేశారట. మరో జోడీలో చైతూను మాత్రం తీసుకున్నారు. కథానాయికగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచన చేస్తున్నారని సమాచారం. చైతూకి జోడీ సెట్ కాగానే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 
naagaarjuna

More Telugu News