Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సమంత కొత్త చిత్రం 'ఓ బేబీ'
  • ప్లే బాయ్ తరహా పాత్రలో నాని
  • 'అంతరిక్షం'కు సీక్వెల్ చేసే యోచన
*  కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ' ఆధారంగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత కథానాయికగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. దీనికి 'ఓ బేబీ' అనే పేరును నిర్ణయించారు. 'ఎంత సక్కగున్నావే' అన్నది దీనికి ఉప శీర్షిక.
*  ప్రస్తుతం 'జెర్సీ' చిత్రంలో నటిస్తున్న హీరో నాని దీని తర్వాత విక్రంకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో నాని ప్లే బాయ్ తరహా పాత్రను పోషిస్తాడని సమాచారం. ఇందులో పలువురు హీరోయిన్లు నటిస్తారు.
*  వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'అంతరిక్షం' చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. కాగా, దీనికి సీక్వెల్ చేసే యోచనలో వున్నట్టు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాజాగా వెల్లడించాడు. దీని కథ పాయింట్ కూడా అనుకున్నామని, క్రిష్ బ్యానర్లో ఇది ఉంటుందని ఆయన చెప్పాడు.
samantha
Nani
varuntej
krish

More Telugu News