Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'96' తెలుగు రీమేక్ కి సమంత ఒప్పేసుకుందట!

  • తమిళంలో విజయాన్ని అందుకున్న '96'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • నిర్మాతగా వ్యవహరించనున్న దిల్ రాజు
 విజయ్ సేతుపతి ... త్రిష జంటగా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన '96' అనే తమిళ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రైట్స్ తీసుకున్నారు.

ఈ సినిమాలో నటించనున్నట్టు కొంతమంది కథానాయకుల పేర్లు వినిపించాయిగానీ, చివరికి శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక తమిళంలో త్రిష చేసిన పాత్ర కోసం ఆమెనే తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ సమంతను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. ఇది ప్రేమకథా చిత్రమే అయినా హీరో .. హీరోయిన్ ని టచ్ చేయడం కూడా జరగదట. అంతగా నటనకు .. ఫీలింగ్స్ కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమా ఇది. అందువల్లనే ఈ సినిమా చేయడానికి వెంటనే సమంత అంగీకరించిందని చెప్పుకుంటున్నారు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
sharwanad
samanta

More Telugu News