చంద్రబాబు పిలుపు ఇవ్వగానే.. తెలంగాణ ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • మూడు రాష్ట్రాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ
  • తన వల్లే గెలిచిందని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం
  • వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో తన కృషి కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు తన పిలుపు కారణంగానే బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిందని చెబుతున్నారనీ, కానీ ఆయన పిలుపుతో ఉలిక్కిపడ్డ తెలంగాణ ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే అలవాటును చంద్రబాబు వదులుకోలేరని విమర్శించారు.

ఈరోజు ఫేస్ బుక్ లో సాయిరెడ్డి స్పందిస్తూ..‘నావల్లే 3 రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందంటున్నాడు నాయుడు బాబు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పిలుపిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మార్మోగిందట. కానీ ఆ పిలుపుతో ఉలిక్కిపడిన తెలంగాణ ప్రజలు బాబు&కో ను ఎన్నికల్లో శాశ్వతంగా భూస్థాపితం చేశారు. బాబు అబద్ధాల నోటి తీట మారదు’ అని పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Facebook

More Telugu News