'వినయ విధేయ రామ' కోసం పోటీపడుతోన్న బయ్యర్లు
- కుటుంబ నేపథ్యలో సాగే కథ
- హిందీ శాటిలైట్ హక్కుల డీల్ 22 కోట్లు
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కుటుంబ సభ్యుల మధ్యగల బంధాలు .. అనుబంధాలు వుంటాయి. కలిసి ఉండటంలోని కమ్మదనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతికి తగిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడానికి బయ్యర్లు పోటీపడుతున్నారట. నైజామ్ ఏరియా హక్కులు 24 కోట్లకి అమ్ముడై .. నాన్ 'బాహుబలి' రికార్డును సృష్టించాయని అంటున్నారు. ఇక హిందీ శాటిలైట్ హక్కుల డీల్ 22 కోట్లకి కుదిరినట్టుగా చెబుతున్నారు.