నేడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న బ్యాడ్మింటన్ స్టార్లు సైనా-కశ్యప్
- నేడు సైనా-కశ్యప్ రిజిస్టర్ మ్యారేజ్
- అతి కొద్ది మంది మాత్రమే హాజరు
- 16న వివాహ విందు
కశ్యప్ ఉపనయన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరు కానున్నారు. నేడు వివాహం చేసుకోనున్న సైనా-కశ్యప్ జంట ఈ నెల 16న వివాహ విందు ఇవ్వనున్నారు. దీనికి ప్రముఖ క్రీడాకారులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.