థియేటర్ వద్ద.. మోహన్ లాల్ కటౌట్ 130 అడుగులు!

  • రేపే ప్రేక్షకుల ముందుకు 'ఒడియన్'
  • అత్యధిక థియేటర్లలో విడుదల  
  • కేరళలో వెల్లువెత్తిన అభిమానం
మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'ఒడియన్' రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేరళలోని మోహన్ లాల్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

అభిమానులంతా కలిసి .. కేరళలోని త్రిసూర్ జిల్లాలో గల 'రాగం' థియేటర్ ప్రాంగణంలో 130 అడుగుల మోహన్ లాల్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ ఇంత ఎత్తైన కటౌట్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మలయాళంలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా కూడా ఇది కొత్త రికార్డును సాధించింది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను మోహన్ లాల్ కి మంచి ఇమేజ్ వుంది. అందువలన రేపు మలయాళంలోనే కాకుండా తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
Go Back to Shorts
mohanlal
manju

More Telugu News