రానా 'హిరణ్యకశిప' బడ్జెట్ 200 కోట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానా 'హిరణ్యకశిప' బడ్జెట్ 200 కోట్లు

  • గుణశేఖర్ దర్శకుడిగా 'హిరణ్యకశిప'
  • ప్రధాన పాత్రలో దగ్గుబాటి రానా 
  • జనవరిలో పూజా కార్యక్రమాలు
గుణశేఖర్ కి పౌరాణికాలపై మంచి పట్టువుంది. ఆయన తెరకెక్కించిన 'బాలల రామాయణం' సినిమా అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. చాలాకాలం తరువాత ఆయన మరో భారీ పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీహరిని శత్రువుగా భావించే హిరణ్యకశిపుడు .. శ్రీహరిని ప్రాణంగా ఆరాధించే ప్రహ్లాదుడి కథతో ఈ సినిమా కొనసాగుతుంది. గతంలో 'భక్త ప్రహ్లాద' వచ్చినప్పటికీ, ఈ సినిమాలో హిరణ్యకశిపుడి గురించి పూర్తిస్థాయిలో ఆవిష్కరించడం జరుగుతుంది.

అందువల్లనే ఈ సినిమాకి 'హిరణ్య కశిప' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. రానా ప్రధాన పాత్రను పోషించనున్న ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్నారు. 200 కోట్ల వరకూ ఖర్చు చేయడానికి సిద్ధంగా వాళ్లు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అంతకి మించి ఖర్చు అయ్యే అవకాశం లేకపోలేదనే ఆలోచన కూడా చేశారట. జనవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.       
raana

More Telugu News