మోసం చేసి గెలిచిన కాంగ్రెస్... మూడు రోజుల తరువాత స్పందించిన యోగి ఆదిత్యనాథ్!
- కాంగ్రెస్ మోసం త్వరలోనే తెలుస్తుంది
- భవిష్యత్తులో కాంగ్రెస్ తో పోరు మరింత సులభం
- ఓడిపోతే ఈవీఎంలపై నిందలు వేసే రకం కాదన్న ఆదిత్యనాథ్
నేపాల్ లోని జనక్ పూర్ లో పర్యటించిన ఆయన, తిరుగు ప్రయాణంలో పట్నాలోని మహావీర్ దేవాలయాన్ని సందర్శించిన తరువాత, మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రాల్లో సీఎంలను ఎంపిక చేసుకోవడమే కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద సవాలుగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏది ఎదురైనా హుందాగా స్వీకరిస్తామని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఓడిపోతే ఈవీఎంలపై నిందలు వేసే పార్టీ తమది కాదని చెప్పారు.