Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కితకితలు పెట్టేస్తోన్న 'ఎఫ్ 2' టీజర్

  • హాస్యరస ప్రధానంగా సాగే 'ఎఫ్ 2'
  • పెళ్లి ప్రధానంగా సాగే కథాకథనాలు 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు      
అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి కామెడీనే ప్రధానంగా తీసుకుని ఆయన 'ఎఫ్ 2' సినిమాను చేశాడు. వెంకటేశ్ .. తమన్నా, వరుణ్ తేజ్ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రేపు వెంకటేశ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. కామెడీ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. "ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం .. క్రీస్తు శకం అంటాము. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు .. పెళ్లికి తరువాత" అంటూ వెంకీ చెప్పిన ఫన్నీ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతోంది. కంటెంట్ ఏమిటనేది చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుంది. రఘుబాబు చెబుతున్నా వినిపించుకోకుండా వెంకీ పెళ్లి చేసుకుని కష్టాలు పడటం .. వెంకీ చెబుతున్నా వినిపించుకోకుండా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని తంటాలు పడటం చాలా ఫన్నీగా చూపించారు. 
venkatesh
varun
tamannah
mehreen

More Telugu News