చరణ్ తో స్టెప్పులేసేది కేథరిన్ కాదు .. ఈషా గుప్తా!
- ఈ నెల 14న ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ
- 22వ తేదీ లోగా మరో డ్యూయెట్ పూర్తి
- సంక్రాంతికి భారీస్థాయి విడుదల
ఈ ఐటెమ్ సాంగ్ కోసం రకుల్ .. కాజల్ పేర్లను పరిశీలించారు. చివరికి కేథరిన్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఆ తరువాత ఏం జరిగిందో గానీ, ఈషా గుప్తా పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. చరణ్ తో కలిసి 'పబ్'లో స్టెప్పులేయనున్నది ఈ బాలీవుడ్ సుందరే. ఈ నెల 22వ తేదీలోగా నాయకా నాయికలపై మరో డ్యూయెట్ ను హైదరాబాద్ శివార్లలో చిత్రీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.