goshamahal: నన్ను ఓడించేందుకు మజ్లిస్‌ విఫల యత్నం చేసింది: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించారు
  • డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు
  • అయినా ప్రజలు నా వైపే నిలిచినందుకు కృతజ్ఞతలు

తనను ఓడించేందుకు మజ్లిస్‌ పార్టీ చేయని ప్రయత్నం లేదని, అయినా ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి తనకే పట్టం కట్టారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మజ్లిస్‌ పార్టీ నాయకులు నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయినా ఓటర్లు నావైపే నిలిచి నన్ను గెలిపించారని, వారికి ధన్యవాదాలని చెప్పారు.

goshamahal
rajasing
majlis
  • Loading...

More Telugu News