కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు!

  • అందరు హీరోల కంటే కేసీఆర్ హ్యాండ్ సమ్ గా ఉంటారు
  • చంద్రబాబు కంటే కేసీఆర్ 2000.0 రెట్లు ఎక్కువ
  • పటేల్ కంటే 2.0 రెట్లు పెద్దదైన కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలి  
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ముందు విపక్షాలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హేయ్ కేటీఆర్. మీ నాన్న 2.0 మాత్రమే కాదు... రజనీకాంత్ కంటే 20.0 రెట్లు, మహేష్ బాబు కంటే 200.0 రెట్లు, చంద్రబాబు కంటే 2000.0 రెట్లు ఎక్కువ' అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ, ఆ విషయం తనకెప్పుడో తెలుసంటూ రీట్వీట్ చేశారు. 'ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది రాము గారు' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా.... ఆ విషయం తనకు అర్థం కాలేదనే విషయం అర్థమవుతోందని వర్మ చెప్పారు.

 'మీకు, మీ నాన్నకు 2.0 బిలియన్ ఛీర్స్' అని తెలిపారు. అందరు హీరోయిన్ల కంటే కేసీఆరే అందంగా ఉంటారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని...  కానీ ఇప్పుడు అందరు హీరోల కంటే కేసీఆర్ హ్యాండ్ సమ్ గా ఉంటారని, హిమాలయాలకంటే ఆకర్షణీయంగా ఉంటారని చెబుతున్నానని అన్నారు. గుజరాత్ లో అతి పెద్ద పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారని... తెలంగాణలో 2.0 రెట్ల పెద్దదైన కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని సూచించారు.  
ram gopal varma
rgv
tollywood
bollywood
kcr
KTR
TRS

More Telugu News