దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం: సీఎం కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం: సీఎం కేసీఆర్

  • దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తాం
  • రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది
  • దేశంలో కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రభుత్వాలు రావాలి
దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చైతన్యవంతమైన గడ్డ కనుక, దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తామని అన్నారు.

 రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉందని, ఇది మారాలని, దేశంలో కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రభుత్వాలు రావాలని అభిప్రాయపడ్డారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందని, దేశ రాజకీయాలు స్టీరియోగా మారాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం మారకపోతే బాగుపడదని అన్నారు. ఈరోజు వెలువడ్డ తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశానికి ఓ మార్గాన్ని చూపించాయని అన్నారు.
kcr
TRS

More Telugu News