కేటీఆర్ అన్నా.. ఈ బుల్లెట్ దెబ్బ గుర్తుండిపోతుంది: ట్విట్టర్ లో మంచు మనోజ్ ప్రశంసలు!

తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో 46 సీట్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మరో 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, హీరో మంచు మనోజ్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో స్పందిస్తూ. ‘కేటీఆర్ అన్నా.. ఒక్క బుల్లెట్ తో అంతమందా? ఈ దెబ్బ గుర్తుండిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. గతంలో లాగే ఇకపై కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ట్యాగ్ చేశారు.

Telangana
Telangana Assembly Results
KTR
TRS
manchu manoj
Twitter
praise

More Telugu News