పీవీ సింధు బయోపిక్ లో సోనూసూద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీవీ సింధు బయోపిక్ లో సోనూసూద్

  • నటుడిగా సోనూ సూద్ కి మంచి గుర్తింపు 
  • నిర్మాతగా పీవీ సింధు బయోపిక్ కి సన్నాహాలు 
  • కోచ్ పాత్రలో సోనూ సూద్  
బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. బయోపిక్ లకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరహా సినిమాలు అక్కడ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది.

ఇక మరో వైపున బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి సోనూసూద్ సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో ప్రతినాయక పాత్రధారిగా సోనూసూద్ కి మంచి గుర్తింపు వుంది. పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పీవీ సింధు బాల్యం నుంచి ఒలంపిక్ మెడల్ సాధించేవరకూ ఈ కథ కొనసాగుతుంది. ప్రధానపాత్రను పోషించే నటి కోసం అన్వేషిస్తున్నారు. ఈ సినిమాలో పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సోనూ సూద్ పోషించనుండటం విశేషం.  
sonu sood

More Telugu News