పెళ్లి చేసుకుందామని నేనే మల్లికార్జున్ తో అన్నాను: సింగర్ గోపికా పూర్ణిమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకుందామని నేనే మల్లికార్జున్ తో అన్నాను: సింగర్ గోపికా పూర్ణిమ

  • ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాడు
  • నా సమాధానం విని షాక్ అయ్యాడు
  • పెళ్లి చేసుకుందామా అని అడిగింది నేనే  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సింగర్ మల్లికార్జున్ .. ఆయన భార్య గోపికా పూర్ణిమ పాల్గొన్నారు. ఈ ఇద్దరూ కూడా తమకి సంబంధించిన అనేక విషయాలను ఈ కార్యక్రమం వేదికగా పంచుకున్నారు. మల్లికార్జున్ మాట్లాడుతూ .. "గోపికా పూర్ణిమతో ఏదో తెలియని అనుబంధం పెరిగిపోతున్నట్టుగా అనిపించింది. అంతే .. వెంటనే ఆమె ఇంటికి ఫోన్ చేసి .. ఆమెకి 'ఐ లవ్ యు' చెప్పేశాను.

ఆమె నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా అని నేను ఆత్రంగా ఎదురుచూస్తుంటే 'ఇంకేంటి సంగతులు' అంది. అంతే, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు .. సాయంత్రం కలుద్దాంలే అని కాల్ కట్ చేశాను" అన్నాడు. అప్పుడు గోపికా పూర్ణిమ అందుకుంటూ .." ఆ రోజున ఐలవ్ యు చెప్పిన మల్లికార్జున్ .. ఆ తరువాత ఆ ప్రస్తావన తీసుకురాలేదు .. నేను ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ముందుగా ప్రేమను వ్యక్తం చేసింది ఆయన అయితే, పెళ్లి చేసుకుందామా? అని అడిగింది మాత్రం నేనే" అని ఆమె చెప్పుకొచ్చింది.  
mallikarjun
gopika

More Telugu News