సిద్ధిపేటలో దూసుకెళుతున్న కారు..1,06,816 ఓట్ల మెజారిటీలో హరీశ్ రావు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు 1,06,816 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.  టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుట్ల, కంటోన్మెంట్, వర్ధన్నపేట, జగిత్యాల నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించింది. తాజా ఫలితాల మేరకు టీఆర్ఎస్ 90 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 18, బీజేపీ 2, మజ్లిస్ 4, ఇతరులు ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Telangana
Siddipet District
Harish Rao
TRS
Telangana Assembly Results
won

More Telugu News