జిల్లాకు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని స్థితిలో కాంగ్రెస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిల్లాకు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని స్థితిలో కాంగ్రెస్!

  • దక్షిణ తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
  • 16 చోట్ల మాత్రమే కాంగ్రెస్ లీడింగ్
  • దూసుకెళుతున్న టీఆర్ఎస్
తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం జిల్లాకు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని స్థితిలో కాంగ్రెస్ కూరుకుపోయింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ టీఆర్ఎస్ తన సత్తాను చాటుతోంది. తెలంగాణలో 31 జిల్లాలుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి కేవలం 16 చోట్ల మాత్రమే లీడింగ్ లో ఉంది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ 91 చోట్ల లీడింగ్ లో ఉంది. నిర్మల్, మునుగోడు, ములుగు, తుంగతుర్తి, హుజూర్ నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, మిగతా ప్రాంతాల్లో టీఆర్ఎస్ దూసుకెళుతోంది.
Telangana
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
Congress
TRS

More Telugu News