జగన్ ను పులివెందులలో అడుగుపెట్టనివ్వం.. ఈ జన్మలో ఆయన సీఎం కాలేడు!: మంత్రి ఆదినారాయణ రెడ్డి
- నన్ను పల్లెల్లోకి రానివ్వబోమని అంటున్నారు
- జగన్ ను కడపకు రాకుండా ఆపే సత్తా మాకుంది
- ఏపీలో ఇకపై పవర్ గేమ్ ఆడుతామని వ్యాఖ్య
‘తన తండ్రి వైఎస్ ఫొటోను ఓ పేపర్ లో రోజూ వేసుకునే జగన్.. ఆ పేపర్ తనది కాదని చెబుతాడు. భారతి సిమెంట్ తో తనకు సంబంధం లేదంటాడు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఖరీదైన ఇళ్లు తనవి కాదని చెబుతాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టిన 12 కేసులతో తనకు సంబంధమే లేదంటాడు. కానీ మాపై తన ఛానల్, పేపర్ లో నిత్యం తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. చివరికి పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లపై కూడా నీచ రాజకీయం చేస్తున్నారు’ అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.