కడప జిల్లాలో మంత్రిని అడ్డుకున్న వైసీపీ నేత.. ఉద్రిక్తత
- వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
- మంత్రిని అడ్డుకున్న సుధీర్ రెడ్డి
- భారీగా మోహరించిన పోలీసులు
ఈ గ్రామం నుంచి కొందరు వైసీపీ కార్యకర్తలు మంత్రి ఆదినారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆదినారాయణరెడ్డిని అడ్డుకునేందుకు వైసీపీ నేత సుధీర్ రెడ్డి యత్నించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా గ్రామంలో మోహరించారు.