ఏదో గ్యాంబ్లింగ్ జరగబోతోంది.. వీవీ ప్యాట్స్ లోని ప్రింటెడ్ స్లిప్పుల కౌంట్ కు ఈసీ అనుమతివ్వాలి: వంటేరు డిమాండ్
- ఈ డిమాండ్ ను ఎన్నికల సంఘం అంగీకరించాలి
- లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తా
- సోమవారం ఉదయం ఎమర్జెన్సీ పిటిషన్ వేస్తా
ఈవీఎంలపై ప్రజలకు అనుమానం ఉండటంతో, అటువంటిదేమీ లేదని చెప్పేందుకే వీవీ ప్యాట్స్ ను పెట్టారని, ఈ విషయమై తమకు కూడా అనుమానం ఉంది కనుక, తాను ఈ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ కు అనుమతివ్వకపోతే హైకోర్టుకు వెళతామని చెప్పారు. సోమవారం ఉదయం ఎమర్జెన్సీ పిటిషన్ వేసి అనుమతి పొందుతామని అన్నారు