చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుంటే కాంగ్రెస్ కు కనీసం సానుభూతి అయినా దక్కేది!: విజయసాయిరెడ్డి

  • ఈ కలుపు మొక్కతో రైతులకు నష్టం
  • చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లే
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'పార్థీనియం' కలుపుమొక్క లాంటివారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ కబళించే కలుపు మొక్క పంటలను నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసున్నా కాంగ్రెస్ కు కనీసం సానుభూతి అయినా దక్కేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడా దిక్కులేక చంద్రబాబు డబ్బులతో వస్తే కాంగ్రెస్ నేతలు పెత్తనం అంతా ఆయనకు అప్పగించారనీ, ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతున్నారని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నేతల స్వయంకృతాపరాధమేనని తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Congress
Twitter

More Telugu News