తమిళ 'పవర్ స్టార్' శ్రీనివాసన్ కనిపించడం లేదని భార్య ఫిర్యాదు!
- అదృశ్యమయ్యాడని భార్య జూలీ ఫిర్యాదు
- ఇప్పటికే శ్రీనివాసన్ పై పలు పోలీసు కేసులు
- ఊటీలో ఉన్నట్టు తెలియడంతో ఫిర్యాదు వెనక్కు
ఇటీవల ఓ వ్యక్తిని డబ్బు విషయంలో మోసం చేసినట్టు కూడా ఫిర్యాదు రిజిస్టరైంది. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యమయ్యారన్న ఫిర్యాదును అందుకున్న పోలీసులు, విచారిస్తుండగానే, ఆయన ఊటీలో ఉన్నారని తెలిసింది. దీంతో ఆయన్ను కలిసేందుకు ఊటీ వెళ్లిన జూలీ, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. ఆయనపై రిజిస్టర్ అయిన కేసులను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.