ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు
- భార్యతో కలిసి ఖైరతాబాద్ మక్తా పోలింగ్ కేంద్రానికి వచ్చిన నరసింహన్
- పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
- ముఖ్యమైన ఓటు కోసం ఓ గంట సమయం కేటాయించాలని సూచన
అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓ గంట సమయాన్ని కేటాయించాలని, ముఖ్యంగా యువత తమ బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. వీకెండ్ సెలవులు కలిసి వస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రెండు రోజులపాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని చమత్కరించారు.