నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు జైలుకు వెళ్లారా జగన్‌మోహన్ రెడ్డి గారూ?: ఘాటుగా కౌంటర్ ఇచ్చిన పవన్

  • ప్రతిపక్ష నేతగా ఏం చేస్తున్నారని ప్రశ్నించడం తప్పా
  • నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు అవినీతికి పాల్పడ్డారా?
  • నీలా నేనూ తిట్టగలను.. సంస్కారం అడ్డొస్తోందంతే
తన పెళ్లిళ్లపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ మాట్లాడుతూ.. జగన్‌పై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏం చేశావయ్యా అని ప్రశ్నిస్తే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని, తానెన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ఆయనకేంటని ప్రశ్నించారు.

‘‘నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే జగన్ అవినీతికి పాల్పడ్డారా? నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే ఆయన జైలుకు వెళ్లారా? లేదంటే, నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే రాష్ట్రం విడిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడితే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు, అన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటున్నారు. పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషా చేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎవరూ లేరిక్కడ’’ అని పవన్ నిప్పులు చెరిగారు. ‘‘ముఠా సంస్కృతి ఉన్న నీకే అంతుంటే చేగువేరా స్ఫూర్తితో ముందుకెళ్తున్న నాకెంత ఉండాలి? మీ కూతలకు బెదిరిపోయేవారెవరూ లేరిక్కడ. మీ ఒక్కొక్కరి జీవితాలు రోడ్డు మీద పెడతా’’ అని హెచ్చరించారు.

‘‘మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు విజయమ్మే ఆ పని చేయించారంటే నేను టీడీపీ నేతలను తిట్టాను. ఏ తల్లి అయినా కొడుకు మీద దాడి చేయిస్తుందా? అని కోప్పడ్డాను. మీలాగే మేమూ తిట్టగలం కానీ సంస్కారం నన్ను వెనక్కి లాగుతోంది. నేను విధానాలనే వ్యతిరేకిస్తా. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లను. ఓట్లు వేయకపోతే జనాలను తిడతారా?’’ అని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  
Go Back to Shorts
Jagan
Pawan Kalyan
Anantapur District
Jana Sena
Yanamala

More Telugu News