మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేశ్
- కీర్తి సురేశ్ కి కలిసొచ్చింది
- 'మహానటి'తో పెరిగిన క్రేజ్
- తమిళంలో రెండు హిట్లు
'మహానటి' తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయట. అయితే కొంతకాలం పాటు హీరోలతో జోడి కట్టే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న కీర్తి సురేశ్, నాయికా ప్రాధాన్యత కలిగిన ఒక కథను చేయడానికి మాత్రం ఒప్పుకుందట. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా తెలుగులో రూపొందనుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయంతో పాటు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే కంటెంట్ లో విషయం ఉండేవుంటుందనుకోవచ్చు.