గజ్వేల్ లో ఆయన పోతారంట... పేరు అడగొద్దు... పోలీసులే చెప్పారు!: లగడపాటి సంచలన వ్యాఖ్యలు
- అక్టోబర్ 28న గజ్వేల్ వెళ్లా
- తనిఖీ పోలీసులు కారును ఆపారు
- రాజకీయ సమాచారం తెలుసుకున్నానన్న లగడపాటి
అక్టోబర్ 28న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్నారని చెప్పిన లగడపాటి, వారు తనను గుర్తు పట్టరని అనుకున్నానని, కానీ గుర్తు పట్టి పలకరించారని చెప్పారు. గజ్వేల్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తరువాత తెలుపుతానని అన్నారు. కాగా, గజ్వేల్ లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లగడపాటి తన వ్యాఖ్యల్లో కేసీఆర్ పేరును ప్రస్తావించకపోయినా, ప్రజల్లో మాత్రం ఆయన గెలుపుపై కొత్త చర్చ మొదలైంది.